Hit TV Exclusive Interview With Rakesh Master Brother
Rakesh Master Brother: డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master Brother) మృతిపై సందేహాలు నెలకొన్నాయి. ఒంటిపై గాయాలు కనిపించడంతో ఏం జరిగిందనే అనుమానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో హిట్ టీవీ, రాకేష్ మాస్టర్ సోదరుడు అలేటి అటంతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. తమది అన్నదమ్ముల అనుబంధం అని.. ఓకే తల్లికి జన్మించలేదని వివరించారు. మాస్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారని.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా అని చెప్పేవారని గుర్తుచేశారు.
చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవారమని.. దసరా, క్రిస్మస్, దీపావళి వస్తే 10 రోజులు సెలవులు ఇచ్చేవారని తెలిపారు. 10 రోజులు అంటే పది రాళ్లు పట్టుకునే వారని.. ఒక్కో రోజు గడిస్తే రాయి తీసివేసే వారని తెలిపారు. రెండేళ్ల నుంచి చనిపోతానని చెప్పేవారని వివరించారు. చనిపోయే రెండు రోజుల ముందు కూడా ఇద్దరం కారులో వెళ్లామని పేర్కొన్నారు. ఆగదు ఈ లోకం అనే పాట ప్లే అయినప్పుడు మాస్టర్ చనిపోయే స్టేజీలో ఉన్నారని వెల్లడించారు. చావును, సంతోషాన్ని కూడా సమపాళ్లలో ఆస్వాదించారని తెలిపారు. చనిపోయే రోజు భార్య, పిల్లలను చూసి ఏడ్చాడని వివరించారు.
కర్ణుని చావుకి వంద కారణాలు అన్నట్టు మాస్టర్ చావుకి కూడా చాలా కారణాలు ఉన్నాయి. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫీజు కోసం, ఇల్లు మంచిగా చేసేందుకు ఈవెంట్ పెట్టారని తెలిపారు. శేఖర్ మాస్టర్ పిల్లలు విమానంలో తిరుగుతున్నారని.. తన బిడ్డలు కనీసం కారులో తిరగాలి అనేవారని తెలిపారు. అందుకోసమే ఈవెంట్ చేశాడని.. అలా యూట్యూబ్ ద్వారా మంచి సంపాదన వచ్చిందని పేర్కొన్నారు. 2.30 లక్షల సబ్ స్క్రైబర్స్ కాస్త 4 లక్షలకు చేరారని.. దీంతో రూ.2.50 లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల చనిపోయిన ఓ డ్యాన్స్ మాస్టర్ కుటుంబానికి సాయం చేయాలని అనుకున్నారని వివరించారు.
మాస్టర్ ఎక్కువగా తాగేవారని.. రోజు 20 నాకౌట్ బీర్లు డ్రింక్ చేసేవారని, లేదంటే 4 మ్యాన్ సన్ హౌస్ బాటిల్స్ తీసుకునేవారని తెలిపారు. తెలంగాణ కన్నా ఏపీలో మందు బాగుండదని.. భూమ్ అనే బీర్ తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ఉంటుందని చెప్పారు. అలా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని.. చివరి రోజుల్లో సంతోషంగా గడిపారని తెలిపారు. యాసిడ్ తాగలేదని.. వైద్యులు ఎందుకు అలా చెప్పారో అర్థం కాలేదని వివరించారు. మాస్టర్ ఒంటిపై గాయాలకు గల కారణం సోరియాసిస్ అని వివరించారు. డ్రగ్స్ తీసుకోలేదని.. సినీ ఫిల్డ్ అయినందున డౌట్ వస్తోందని పేర్కొన్నారు.