సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని వైవీఆర్ ప్రాజెక్టు డీఈ వెంకటరాము, ఏఈ కృష్ణకుమార్ గురువారం రాత్రి 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గంగమ్మ పరవళ్లు తొక్కుతూ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వెళ్తుంది. రిజర్వాయర్ లెవెల్ 384 మీటర్లు కాగా అంతకుమించి ఉన్న నీటిని కిందికి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.