JGL: ధర్మపురి మండలంలోని జైన, మగ్గిడి గ్రామాల్లోని పిఎసిఎస్ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్.. ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది? ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉంది? అని పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.