SKLM: ఎచ్చెర్ల ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు ఒత్తిడిని నివారించగలిగితే ఉపాధి హామీ పథకం పారదర్శకంగా ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.