AP: రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ముగియనుంది. కాగా.. 1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్ కొత్త సీఎస్‌గా నియామకమైనట్లు తెలుస్తోంది.