ఖమ్మం: మధిర మున్సిపాలిటీ పరిధిలోని HDFC బ్యాంక్ వద్ద చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తాకి ప్రమాదకరంగా మారాయి. దీంతో అటువైపు నుంచి వెళ్లాలంటేనే స్థానికులు జంకుతున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ తీగల్లో ఉన్న చెట్టు కొమ్మలను తొలగించి ప్రమాదానికి గురికాకుండా చూడాలని స్థానికులు కోరారు.