TG: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న CRPF బలగాలు పర్యవేక్షణ బాధ్యతను ఉపసంహరించుకున్నాయి. వారి స్థానంలో SPF సిబ్బంది రంగంలోకి దిగారు. అదే సమయంలో డ్యామ్ వద్ద విధుల్లో కొనసాగాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తెలంగాణ వైపు మళ్లీ CRPF బలగాలు బాధ్యతలు తీసుకున్నారు. ఈ విషయంపై డ్యామ్ SEని అడగగా.. సమాచారం లేదని తెలిపారు.