MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు వివరాలను ఇచ్చేందుకు ప్రజలు అందుబాటులో ఉండాలని ఈవో రాహుల్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కాలనీలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగంగా జరుగుతుందన్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి అందుబాటులో లేరని, దీంతో వారి వివరాలు సేకరించడం కష్టంగా ఉందన్నారు. డిసెంబర్ 31 తుది గడువని తెలిపారు.