VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను సినీ గాయకుడు కారుణ్య సంప్రదాయం వస్త్రాలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కారుణ్యకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కప్ప స్తంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో స్వామికి విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.