AP: చట్టం నుంచి మాజీమంత్రి పేర్ని నాని తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని వ్యాఖ్యానించారు.