ATP: గుంటూరులో షాప్ ఛైర్మన్ రవి నాయుడుని ఎన్ఐఎస్ జూడో కోచ్ సాకే. పురుషోత్తం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు సహకరించి అదేవిధంగా ఎన్ఐఎస్ చేసినటువంటి వారికి కోచ్ పోస్టులు విడుదల చేసి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి జూడో క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా రవి నాయుడుని కోరారు.