TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేనికి భయపడనని అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేక తనపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని వెల్లడించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారని పేర్కొన్నారు.