ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ అనే వ్యక్తికి దొరికిన ఓ రాయి అతడిని కోటీశ్వరుడిని చేసింది. దానిని పరిశోధించిన శాస్త్రవేత్తలు విస్తుబోయే విషయాలు వెల్లడించారు. ఈ రాయి 4.6 బిలియన్ సంవత్సరాలు క్రితం నాటిదని.. నికెల్, ఐరన్ మూలకాల మిశ్రమైన ఈ రాయి అంగారకుడు, బృహస్పతి మధ్య ఉన్న ఉల్క బెల్ట్ ద్వారా భూమికి చేరి ఉంటుందని తెలిపారు. దీని విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని లెక్కగడుతున్నారు.