GNTR: మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని మాజీ జడ్పీటీసీ ఆకుల జయసత్య ప్రారంభించారు. శిబిరములో నేత్ర వైద్యనిపుణులు రహీమ్ భాషా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జయసత్య మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేయడంతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.