KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్లలో 2రోజుల్లో రెండు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురవడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బస్టాండ్ సమీపంలో హోండా షైన్ బైక్, గురువారం గంజిహళ్లి క్రాస్ రోడ్డు వద్ద పల్సర్ బైక్ దొంగిలించారు. సీసీ కెమెరాల్లో ఇద్దరు అనుమానితులు బైక్‌తో ఎమ్మిగనూరు వైపు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి.