AP: వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆ పార్టీ నేతుల అబద్ధపు ధర్నాలు నిర్వహించారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల పాపం మాజీ సీఎం జగన్‌దేనని అన్నారు. విద్యుత్ రంగంలో రూ.49 వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్.. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టునూ ఏర్పాటు చేయలేక పోయానని అన్నారని పేర్కొన్నారు.