TG: అల్లు అర్జున్‌కు క్షమాపణలు చెప్పాలంటూ తమకు బెదిరింపులు వస్తున్నాయని ఓయూ జేఏసీ పోలీసులను ఆశ్రయించింది. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని తెలిపారు. తమకు ఫోన్ కాల్స్ ఆగకుంటే.. మరోసారి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.