ప్రకాశం: బల్లికురవ మండలంలోని ఈర్లకొండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని వెంకటేష్ అనే యువకుడు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి వివేకానంద రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా ఎస్సై జీవి చౌదరి తెలిపారు.