KMM: ఈనెల 26న పెద్దతండాలో నిర్వహించనున్న సీపీఐ 14వ మండల మహాసభకు ఇంటికో మనిషి, శాఖకో బండి చొప్పున కామ్రేడ్స్ కదలి రావాలని ఆ పార్టీ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డులో మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మహాసభకు రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు రానున్నట్లు చెప్పారు.