SKLM: ఎచ్చెర్ల వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలకు తీగలు అలుముకున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు విద్యుత్ ట్రిప్ అవుతూ.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ వినియోగదారులు వాపోతున్నారు. దీంతో అనేక అవస్థలు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తీగలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.