NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్లను ఆదివారం జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అర్చకులు అతిధులను శేష వస్త్రములతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేశారు.