కడప: గాలివీడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిపై జరిగిన దాడిని ఖండిస్తూ వారికి సంఘీభావంగా శనివారం దువ్వూరు మండలం పరిషత్ కార్యాలయ సిబ్బంది నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.