ATP: ఇల్లు లేని నిరుపేదలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో హౌసింగ్, మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గతంలో ఇండ్ల దరఖాస్తులు చేసుకొని ఇల్లు అందని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.