KRNL: చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ఎన్నికల తర్వాత చేతల్లో తేడా ఉందని కర్నూలు డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్త విమర్శించారు. శనివారం ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తాను ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను అన్నారని గుర్తుచేశారు. కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని అన్నారు.