మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలకు పాకిస్తాన్కు చెందిన రాజకీయ ప్రముఖులెవరూ హాజరు కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్లోని చక్వాల్ జిల్లా నుంచి మన్మోహన్ కుటుంబం భారత్కు వచ్చింది. గతంలో మాజీ ప్రధానులు బెనజీర్ భుట్టో, నవాబ్ షరీఫ్.. రాజీవ్ గాంధీ అంత్యక్రియలకు హాజరయ్యారని గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు.