JN: ఇటీవల పాలకుర్తిలో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పాలకుర్తి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం.. చారగొండ్ల మల్లయ్య కాలనీలో లలిత అనే మహిళ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ను పోలీసులు పట్టుకున్నారు. అతను వద్దనుండి రూ.4.06 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.