SKLM: విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైసీపీకి లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్ కొనుగోళ్లు పేరుతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లేలా చేసి ప్రజలను మోసం చేశారన్నారు. నగరంలోని విశాఖ-ఏ కాలనీలోని తన కార్యాలయంలో విలేకరులతో శనివారం మాట్లాడారు.