SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో శనివారం చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారణ ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. కూటమి పాలనతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు చేరిన వారు తెలిపారు.