JN: పాలకుర్తిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గడువులోపు సర్వేను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామస్తుల నుండి తీసుకున్న పూర్తి వివరాలను తప్పులు లేకుండా యాప్లో నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ, మండల స్పెషల్ ఆఫీసర్ వసంత తదితరులున్నారు.