Nakka Anand Babu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగతనంగా చూశారా.. సజ్జల విచారణకు డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) ఏ ప్రజాప్రతినిధి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) ఎలా తెలుసునని, వారు ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని ఎలా చెబుతారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు (Telugu Desam Party) నక్కా ఆనంద బాబు (Nakka Anand Babu) ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) ఏ ప్రజాప్రతినిధి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) ఎలా తెలుసునని, వారు ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని ఎలా చెబుతారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు (Telugu Desam Party) నక్కా ఆనంద బాబు (Nakka Anand Babu) ప్రశ్నించారు. తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని, మా వాళ్లు మాకు ఓటు వేయలేదని, కొందరు క్రాస్ ఓటింగ్ చేశారని, మేము ఇచ్చిన కోడింగ్ ను అనుసరించలేదని సజ్జల చెబుతున్నారని, కానీ ఇది ఎన్నికల నిబంధనల మేరకు నేరం అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. సీక్రెట్ ఓటింగ్, సీక్రెట్ బ్యాలెట్ జరిగినప్పుడు వారు ఎవరికి ఓట్లు వేశారో దొంగతనంగా ఎలా చూశారని ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ అంటూ, పేర్లు చెబుతున్నారు కాబట్టి సజ్జలను ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జల వల్ల హానీ ఉందని ఆమె అంటున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పైన సమన్వయర్తలు, ఇంచార్జులను పెట్టి అవమానిస్తున్నారని, బెదిరిస్తున్నారన్నారు. అందుకే ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కసిగా ఉన్నారన్నారు. పది కోట్ల రూపాయలు పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను తమ అధినేత చంద్రబాబు కొనుగోలు చేసారని వైసీపీ ఆరోపిస్తోందని, సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. అసలు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ను వారు ఎన్ని కోట్లకు కొనుగోలు చేశారో చెప్పాలని నిలదీశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎన్ని కోట్లకు తీసుకున్నారన్నారు. వారికి వందల కోట్లు ఇచ్చి రెండు మూడేళ్లుగా మేపుతున్నారన్నారు. టీడీపీ నుండి గెలిచిన వారిని వైసీపీ కొనుగోలు చేసిందని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తిరుగుబాటు చేసి, అసంతృప్తి వ్యక్తం చేస్తే ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.