మహబూబ్ నగర్: దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఏంఎన్ఎస్ ఆధ్వర్యంలో మను ధర్మశాస్త్రం పత్రాలను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, కుల వివక్షను రూపుమాపేందుకు కృషి చేశారని అన్నారు.