SRD: పటాన్చెరు భవిష్యనిధి సమస్యల పరిష్కారానికి నిధి ఆప్కే సంఘటన్ 2.0 కార్యక్రమంలో భాగంగా రేపు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు రామచంద్రపురం బిహెచ్ఈఎల్ ప్రధాన గేటు, మెదక్ జిల్లా నర్సాపురం మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ బలబాగ్ వద్ద మూడు కేంద్రాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.