TG: గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వాసుల పట్ల వారి కుటుంబసభ్యులు ఆందోళన పడవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారి సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.