»Us President Joe Biden Praised China On Canada Parlament Video Viral
US President: చైనాను పొగిడిన బైడెన్.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) పొరపాటును చైనా(china)ను ప్రశంసించారు. కెనడా పార్లమెంట్(Canadian parliament)లో ప్రసంగిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అగ్రరాజ్యం అమెరికాకు శత్రు దేశంగా ఉన్న చైనా(china)ను యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) మెచ్చుకున్నారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును నీజమే. కానీ జో బైడెన్ పొరపాటును చైనాను అభినందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం కెనడా పార్లమెంట్(Canadian parliament)లో ప్రసంగిస్తూ చైనాను అభినందిస్తూ తప్పుగా ప్రశంసించారు. Biden కెనడియన్ వలస విధానాల గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఆ క్రమంలో వెంటనే తనను తాను సరిదిద్దుకున్నారు. నన్ను క్షమించండి. నేను కెనడాను అభినందిస్తున్నానని మళ్లీ తిరిగి స్పష్టం చేశారు.
ఆ క్రమంలో మిస్టర్ బైడెన్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నప్పుడు కెనడియన్ పార్లమెంట్ సభ్యులు(Canadian parliament members) పలువురు నవ్వుకున్నారు. లాటిన్ అమెరికన్ దేశాల నుంచి సంవత్సరానికి 15,000 మంది వలసదారులను అంగీకరించడానికి కెనడాను ప్రశంసించారు. కెనడాలోకి అక్రమంగా వచ్చిన వారిని బహిష్కరించకుండా కెనడియన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అమెరికా ప్రశంసించింది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్(joe Biden), కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో చర్చల కోసం ఒట్టావాకు చేరుకుని రెండు రోజులపాటు సంప్రదింపులు చేశారు. జనవరి 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది ఆయన దేశ తొలి పర్యటన కావడం విశేషం. ఒక సంయుక్త ప్రకటనలో ఇద్దరు నాయకులు “పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో అంతర్జాతీయంగా ఎదురవుతున్న దీర్ఘకాలిక సవాళ్లను ప్రస్తావించారు.
ఆ వీడియో సందేశాన్ని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ కూడా సోషల్ మీడియా(social media)లో పంచుకున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఇబ్బంది ఎంటని ప్రశ్నించారు.