HYD: బహిరంగ ప్రదేశాల్లో ఈ-వాహనాల కోసం చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు GHMC కసరత్తు చేస్తున్నది. గ్రేటర్లో EV కార్ల సంఖ్య దాదాపు 5వేల వరకు ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు. అందుకు అనుగుణంగా చార్జింగ్ పాయింట్లు పెంచుతున్నారు. ఇప్పటికే 43 ప్రాంతాల్లో అమలు అవుతుండగా.. తాజాగా మరో 40 చోట్ల చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు GHMC ఏర్పాట్లు చేస్తున్నది.