MDK: మాతృభూమికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు స్వర్గీయ మాజీ ప్రధాని వాజపేయీ అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ రోజు వాజపేయీ 100వ జయంతి సందర్భంగా ‘X’ వేదికగా ఎంపీ నివాళులర్పించారు. దేశాభివృద్ధికి బాటలు పరిచి ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిన ధైర్యవంతుడు అని పేర్కొన్నారు. కార్గిల్ విజయంతో భారత సైనిక సత్తాను పరిచయం చేసిన యోధుడు అని కొనియాడారు.