SRCL: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు, 89వ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి, ఎస్పీ మహేష్ బీ గీతే పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీపాదరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, పాల్గొన్నారు.