ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(ram charan).. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15(RC15) ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చరణ్ నుంచి ఆచార్య తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే శంకర్ కూడా ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే మధ్యలో శంకర్ ‘ఇండియన్-2’ లైన్లోకి రావడంతో కాస్త డిలే అయింది.
లేదంటే ఈ పాటికే షూటింగ్ కంప్లీట్ అయి ఉండేది. అయినా శంకర్ ఈ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌ను నవంబర్ మొదటివారంలో మొదలుపెట్టబోతున్నారట. ఈ షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఓ పాటను చిత్రీకరించనున్నారట.
అక్కడ వివిధ ప్రదేశాల్లో దాదాపు 10 రోజుల పాటు ఈ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారట. అయితే ఈ పాటకు భారీగా ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క పాట కోసమే 8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. దాంతో ఈ పాటను శంకర్ ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మామూలుగానే శంకర్ సాంగ్స్ భారీగా ఉంటాయి. అయితే ఇంత బడ్జెట్ పెడుతున్నారో లేదో తెలియదు గానీ.. ఈ పాట మాత్రం ఆర్సీ15లో హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.