హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ భారత్‌లో యాక్టివా 125ని న్యూ లుక్‌తో విడుదల చేసింది. ఈ స్కూటర్లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డివైజ్‌లో అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.94,422 (ఎక్స్‌షోరూమ్). ఇందులో పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మేటలిక్, డీప్ గ్రౌండ్ గ్రే, సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మేటలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్లలో లభిస్తుంది.