»Deepika Who Doesnt Care About Ranveers Hand What Does It Matter Viral Video
Ranveer Singh చేయి ఇచ్చినా పట్టించుకోని దీపిక..అప్పుడే డివోస్?
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య కలతలు వచ్చినట్లు తెలుస్తోంది. అదేంటీ పెళ్లి జరిగి నాలుగేళ్లు కూడా కాలేదు. అప్పుడే సమస్యలు మొదలయ్యాయా అని పలువురు అంటున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఓ వేడుకకు హాజరైన క్రమంలోని ఓ వీడియోలో ఈ కపుల్ మధ్య కలతలు వచ్చినట్లు అనిపిస్తుంది. దీపికా, రణవీర్ సింగ్ కలిసి గురువారం జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ ఈవెంట్‌కి వెళ్లారు.
ఆ క్రమంలో వెలుగులోకి వచ్చిన వీడియో క్లిప్‌లో రణవీర్ తన భార్య దీపికాకు తన చేతిని అందజేయగా.. ఆమె అతనిని పట్టించుకోలేదు. అంతేకాదు ఆమె చీరను సరిచేసుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఆ తర్వాత కూడా దీపికా..రణ్ వీర్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఏమైంది ఈ జంటకు అప్పుడే గొడవలు మొదలయ్యాయా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఏప్పుడు విడాకులు తీసుకుంటున్నారా అని అంటున్నారు. ఇంకొ వైపు వారి మధ్య ఏదో సమస్య ఉందని ఒకరు, వారి మధ్య ప్రతిదీ సరిగ్గా లేదని ఇంకొకరు కామెంట్ చేశారు. బహుశా వారు గొడవ పడి ఉండవచ్చని ఇలా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఆమె తన చేతిని చూడలేదని దీపికాకు మద్దతుగా కామెంట్లు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు 40 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. దీపికా, రణవీర్ నవంబర్ 14, 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు.