Vishwak Sen : విలన్‌గా విశ్వక్ సేన్.. కానీ తన హీరోతోనే!
Vishwak Sen : కేవలం హీరోగానే కాదు దర్శకుడిగాను తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతే కాదు తండ్రి కరాటే రాజుతో కలిసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. తనే హీరోగా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది.
కేవలం హీరోగానే కాదు దర్శకుడిగాను తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతే కాదు తండ్రి కరాటే రాజుతో కలిసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. తనే హీరోగా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఫస్ట్ డేనే విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. 8 కోట్లకు పైగా గ్రాస్, నాలుగు కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రేపో మాపో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం పక్కా. ఈ సినిమాలో విశ్వక్ డ్యూయెల్ రోల్ చేశాడు. ఓ పాత్రలో నెగెటివ్ టచ్ ఇచ్చాడు. దాంతో నెగెటివ్ రోల్‌లోను విశ్వక్ సేన్ ఇరగదీశాడని అంటున్నారు అభిమానులు. అంతేకాదు క్లైమాక్స్‌లో ధమ్కీ పార్ట్ 2లో తనలోని విలనిజం డోస్ పెంచబోతున్నట్టు చెప్పేశాడు. అయితే తన సినిమా వరకు విలన్‌గా దాస్ ఓకే. కానీ మరో స్టార్ హీరో సినిమాలో విలన్‌గా ఆఫర్ వస్తే.. విశ్వక్ నటిస్తాడా.. అంటే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తనకు అవకాశం ఇస్తే ఎన్టీఆర్ సినిమాలో మాత్రమే.. విలన్‌గా చేస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. విశ్వక్ సేన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి.. సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఆ అభిమానంతోనే విశ్వక్ ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా నటించడానికి సై అంటున్నాడు. అయితే ఎన్టీఆర్ కోసం ఒక్క విలన్‌గానే కాదు.. డైరెక్ట్ కూడా చేయాలనుందని ఇప్పటికే చెప్పుకొచ్చాడు విశ్వక్. మొత్తంగా ఎన్టీఆర్ కోసం విలన్‌గా, దర్శకుడిగా.. ఛాన్స్ అందుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు విశ్వక్. కానీ ప్రస్తుతం మాత్రం తన సినిమా ప్రమోషన్స్‌కు.. ఎన్టీఆర్ బాగా కలిసొస్తున్నాడు.