»Only Cm In The History Of Up Completed 6 Years Uninterrupted Yogi Adityanath
Yogi Adityanath: యూపీ చరిత్రలోనే సీఎంగా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న ఒకేఒక్కడు యోగి
యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అంటే యువతకు ఓ క్రేజ్. తాను అధికారంలోకి వచ్చాక యూపీలో మాఫియాను కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. అవసరమైతే బుల్డోజర్ లను ఉపయోగిస్తున్నారు. సీఎం యోగి తన పని తీరుతో యూపీ ప్రజల్లో గత ఏ ముఖ్యమంత్రి పొందలేని అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇలాంటి సీఎం మనకూ ఉంటే బాగుండు అంటూ యావత్ దేశ యువత అనుకునేలా పరిపాలన చేస్తున్నారు. అలాంటి యోగి ఇటీవలే ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు (Six Years As Uttar Pradesh CM). ఆయన 19 మార్చి 2017లో మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి అయిదేళ్ల టర్మ్ ముగిసిన తర్వాత 2022లో రెండోసారి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు 1998 నుండి 2017 వరకు వరుసగా ఐదు పర్యాయాలు గోరక్ పూర్ లోకసభకు ప్రాతినిథ్యం వహించారు.
యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనం చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైయస్ వంటి వారిని రెండో టర్మ్ కూడా సీఎం అయిన వారిని చూశాం. మరి యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడంలో ఆశ్చర్యం ఏముందని అనుకుంటున్నారా… ఎందుకంటే యూపీలో ఇప్పటి వరకు ఆరేళ్లు సీఎంగా పని చేసిన వారు లేరు. 1937లో యునైటెడ్ ప్రావిన్స్ నుండి మొదలు 1947లో స్వాతంత్ర వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ ఎనిమిది తొమ్మిది దశాబ్దాల్లో ఎవరు కూడా ఆరేళ్లు అధికారంలో లేరు. 1950లో గోవింద్ వల్లబ్ పంథ్, ఆ తర్వాత సంపూర్ణానంద్ వీరిద్దరు మాత్రమే1950 నుండి 1960 మధ్య కాలంలో వరుసగా 4 ఏళ్ల 336 రోజులు, 5 ఏళ్ల 345 రోజులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత అందరూ 20 రోజుల నుండి రెండేళ్లు, మూడేళ్లు సీఎంలుగా పని చేశారు.
ములాయం సింగ్ యాదవ్ మూడుసార్లు సీఎంగా చేశారు. ఓసారి 1 ఏడాది 201 రోజులు, రెండేసారి 1 ఏడాది 181 రోజులు, మూడోసారి 3 ఏళ్ల 257 రోజులు సీఎంగా ఉన్నారు. మాయావతి నాలుగుసార్లు సీఎంగా చేశారు. వరుసగా 137 రోజులు, 184 రోజులు, 1 ఏడాది 118 రోజులు, 4 ఏళ్ల 307 రోజులు అధికారంలో ఉన్నారు. అఖిలేష్ యాదవ్ 5 సంవత్సరాల 4 రోజులు సీఎంగా పని చేశారు. 1950 తర్వాత అయిదేళ్ల పాటు పని చేసింది అఖిలేష్ మాత్రమే. కానీ ఆరేళ్లు సీఎంగా ఎవరూ లేరు. మొదటిసారి యోగి ఆ ఘనతను సాధించారు. పదేళ్లు పూర్తి చేసుకుంటే యూపీ సీఎంగా ఇది మరో రికార్డ్ అవుతుంది.
యోగికి భలే క్రేజ్
యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. గత ఏడాది జనవరిలో విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ సీఎంలలో యోగి 39.1 శాతంతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న కేజ్రీవాల్ 16 శాతం, మూడో స్థానంలో ఉన్న మమతా బెనర్జీ 7.3 శాతంతో యోగి కంటే చాలా దూరంలో ఉన్నారు.