WGL: గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర రేపు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా జాతరకు వెళ్లే రహదారులను సుగమం చేశారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గీసుగొండ CI విశ్వేశ్వర్ తెలిపారు.