TG: రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 4న స్పీకర్ విచారణ జరపనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై BRS ఎమ్మెల్యేలు వివేకానంద్, కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ విచారించనున్నారు. పార్టీ మారిన వీరిపై చర్యలు తీసుకోవాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. హైకోర్టు ఆదేశాల క్రమంలో స్పీకర్ చేపట్టనున్న ఈ విచారణపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.