KMM: గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఆన్లైన్ ఉద్యోగాలు, షేర్ మార్కెట్ ట్రేడింగ్లో అధిక లాభాల ఆశచూపి రూ.47 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు.