GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ రెండు రోజుల వర్క్ షాపు మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య వక్తగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత విద్వాన్ మల్లాది సూరిబాబు హాజరై విద్యార్థులకు సంగీత రంగంలో మెలకువలను నేర్పించారు. మనోధర్మం, రాగాలాపన, స్వరకల్పన అనే పాఠ్యప్రణాళిక అంశాలను తగు వివరణలతో బోధించారు.