సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. ‘మంచి మనసున్న వారికి మంచే జరుగుతుంది.. ఇది అతడి కష్టానికి దక్కిన ప్రతిఫలం’ అని సంజూను ఆకాశానికెత్తాడు. వెస్టిండీస్‌పై ఛేదనలో కీలక పాత్ర పోషించిన శాంసన్ నిలకడను, పట్టుదలను అభినందించాడు. డగౌట్లో ఉంచి నేర్చుకున్న పాఠాలను మైదానంలో అమలు చేసి సంజూ నిరూపించుకున్నాడని ప్రశంసలు కురిపించాడు.