కామారెడ్డిలోని ‘భరోసా’ సెంటర్ నిర్వహణ బాధ్యతలను మహిళా ఎస్సై శ్రావంతికి అప్పగిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మహిళా ఎస్సై జి. జ్యోతి అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు అందుతున్న సేవలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.