VZM: బాణసంచా నిల్వ, తయారీ, విక్రయ హోల్ సేల్ యజమానులతో విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ ఆర్.గోవిందరావు సమావేశం ఏర్పాటు చేశారు. బాణసంచా విక్రయించేందుకు విక్రయదారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందాలన్నారు. హెచ్చరికలతో కూడిన బోర్డులను, ఫ్లెక్సీలను తాత్కాలిక షాపుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు.