గత 11 నెలల వ్యవధిలో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. వీటి విలువ రూ.223 లక్షల కోట్లు అని పేర్కొంది. భారత్కు చెందిన ఈ డిజిటల్ సేవలు ఇతర దేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఈ యూపీఐ సేవలు యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. ఒక్క నవంబర్ నెలలోనే రూ.23.49 కోట్ల విలువైన లావాదేవీలు జరగటం గమనార్హం.